Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్కూల్ డేస్ లో గోల గోల చేసేవాడిని .. అందుకే ఎక్కువసార్లు బయట నిలబెట్టేవాళ్లు: హైపర్ ఆది

  • స్కూల్ డేస్ లో అల్లరి ఎక్కువ
  • అందరి నోళ్లలో నా పేరు నానేది
  • చదువులో వెనుకబడలేదు
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన ఆర్టిస్టులతో హైపర్ ఆది ఒకరుగా కనిపిస్తాడు. ఆది పంచ్ ల కోసమే ఆయన స్కిట్స్ చూసేవాళ్లు ఎక్కువగా వుంటారు. అలాంటి హైపర్ ఆది తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ .. " నేను స్కూల్ కి వెళితే .. నేను వచ్చిన విషయం అందరికీ తెలిసిపోయేది అంత రచ్చ చేసేవాడిని" అన్నాడు.

"ఫలానా క్లాస్ లో ఆది అనేవాడు వుంటాడు .. వాడు బాగా గొడవ చేస్తాడు అని చెప్పుకునేవారు. అంత గోల చేసేవాడిగా పేరున్నా చదువులో ఎప్పుడూ వెనుకబడలేదు. బాగా చదువుతూ .. మంచి మార్కులు తెచ్చుకునేవాడిని. బాగా గోల చేస్తాననే పేరు రావడంతో ఎక్కువసార్లు క్లాస్ బయట నిలబెట్టేవాళ్లు. ఒక్కోసారి నేను బాధ్యుడిని కాకపోయినా, క్లాస్ లో నుంచి నన్నే బయటికి పంపించేవాళ్లు. అంతగా టీచర్లకు గుర్తుండిపోయేవాడిని" అంటూ చెప్పుకొచ్చాడు.      
hyper aadi

More Telugu News