Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెడ్ మీ 5ఏ 16జీబీ ధర ఇకపై రూ.5,999... మూడు నెలల్లో 50 లక్షల ఫోన్ల అమ్మకాలు

  • ఇంతకాలం రూ.1,000 సబ్సిడీపై విక్రయాలు
  • అనుకున్న 50 లక్షల విక్రయాలు పూర్తి కావడంతో నిలిపివేత
  • ఇకపై సాధారణ ధరపైనే అమ్మకాలు
రెడ్ మీ 5ఏ 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర ఇంతకాలం రూ.4,999కు విక్రయించగా, వినియోగదారులు ఇకపై రూ.5,999 వెచ్చించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతకాలం రూ.1,000 సబ్సిడీపై కంపెనీ విక్రయాలు సాగించగా ఇకపై ఈ సబ్సిడీ ఉండదు. వాస్తవానికి ఈ ఫోన్ ధర రూ.5,999గానే కంపెనీ నిర్ణయించింది. అయితే, 50 లక్షల ఫోన్ల వరకు రూ.1,000 సబ్సిడీపై అందించాలని తీసుకున్న నిర్ణయం మేరకు ఇన్నాళ్లు ధర రూ.4,999గా ఉంది. మూడు నెలల్లోనే 50 లక్షల విక్రయాలు దాటిపోవడంతో ఇకపై ధర రూ.5,999గా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ మోడల్ 3జీబీ ర్యామ్, 32 జీబీ వెర్షన్ ధర రూ.6,999. ఈ ఫోన్లను కంపెనీ గత డిసెంబర్ లో దేశీయ మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. 
redmi 5a

More Telugu News