Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మార్షల్ ఆర్ట్స్‌ నేర్చుకుంటున్న హాట్ హీరోయిన్

  • రేస్-3 చిత్రం కోసం యుద్ధ కళల్లో జాక్వెలైన్ ఫెర్నాండెజ్ శిక్షణ
  • ఆహార నియమాల్లోనూ మార్పులు..ట్రైనర్‌గా కుల్‌దీప్
  • కిక్కింగ్, పంచింగ్‌లపై ప్రత్యేక దృష్టి
బాలీవుడ్‌లో పొడుగుకాళ్ల సుందరి కత్రినా కైఫ్‌కు క్లోనింగ్‌గా జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌ ఉంటుందని చాలా మంది అంటుంటారు. ఇద్దరూ తమ ప్రొఫెషన్ పరంగా ఎంత పర్ఫెక్టో అందరికీ తెలిసిందే. 'ధూమ్-3'లో కత్రినా ఫ్లెక్సిబుల్ డాన్స్‌ని మనం ఎప్పటికీ మరువలేం. ఇప్పుడు జాక్వెలైన్ ఫెర్నాండెజ్ కూడా ఓ ఛాలెంజింగ్ పాత్రకు సిద్ధమవుతోంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న 'రేస్-3' చిత్రం కోసం ఫిట్‌నెస్ ట్రైనర్ కుల్‌దీప్ శశి నుంచి మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ)లో ఈ హాట్ హీరోయిన్ కఠోర శిక్షణ తీసుకుంటోంది. "జాక్వెలైన్‌ది అథ్లెటిక్ తరహా శరీరం. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేందుకు ఇది ఆమెకు ఎంతగానో ఉపకరిస్తుంది. అయితే ఈ సినిమాలో తన పాత్ర కోసం ఆమె ఎంఎంఏ ట్రైనింగ్ తీసుకుంటోంది. ముఖ్యంగా కిక్కింగ్, పంచింగ్‌లపై శ్రద్ధ పెడుతోంది" అని ట్రైనర్ కుల్‌దీప్ చెప్పుకొచ్చారు.

రేస్-3 సినిమాలోని జాక్వెలైన్ నటించే పోరాట సన్నివేశాలకు చాలా డిమాండ్ ఉంది. ఇప్పటివరకు ఆమె చేతులతో ముష్టిఘాతాలు చేయడం లేదా మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించడం ఏ సినిమాలోనూ చేయలేదు. అందువల్ల ఈ యుద్ధ కళల్లో ఆమెకు తర్ఫీదునివ్వడంపై ప్రస్తుతం తాను దృష్టి పెట్టామని కుల్‌దీప్ చెప్పారు. ఆమె తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చేసినట్లు ఆయన చెప్పారు. శిక్షణ సమయంలో ఆమె తన శరీరంలోని కేలరీలను అధిక మొత్తంలో కరిగిస్తోంది. అందువల్ల డైట్‌లో మార్పు చేశామని ఆయన తెలిపారు. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mixed Martial Arts (MMA)
Jacqueline Fernandez
Salman Khan
Race 3

More Telugu News