సాక్ష్యాలు దొరక్కుంటే దయనీయురాలినై పోయేదాన్ని... ఇక రాజీ కష్టమే: క్రికెటర్ షమీ భార్య హసీన్ జహాన్
- ఇప్పటికే భర్తపై పలు రకాల ఆరోపణలు చేసిన జహాన్
- అతని సెల్ ఫోన్ దొరకబట్టే సాక్ష్యాలు సంపాదించా
- ఇక రాజీ ప్రసక్తే లేదు: మీడియాతో జహాన్
ఆ మొబైల్ తనకు చిక్కకుండా ఉండుంటే, షమీ యూపీకి పారిపోయి, తనతో విడాకుల కోసం దరఖాస్తు చేసుండేవాడని ఆరోపించింది. నాలుగేళ్లుగా సర్దుకు పోవాలని చూస్తూనే ఉన్నానని, ఇప్పుడిక రాజీ ప్రసక్తే లేదని, ఆ దశ ఎప్పుడో దాటి పోయిందని వ్యాఖ్యానించింది. కాగా, జహాన్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు షమీ కుటుంబీకులు నలుగురు కోల్ కతా రాగా, వారిని కలిసేందుకు ఆమె నిరాకరించినట్టు తెలిసింది. తన కుమార్తె ఓ సెలబ్రిటీతో న్యాయ పోరాటానికి దిగినందున ఆమె ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని, పోలీసు రక్షణ కల్పించాలని హసీన్ జహాన్ తండ్రి కోరాడు.