ముక్కోణపు సిరీస్‌: బంగ్లాదేశ్‌ ముందు 215 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన శ్రీలంక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముక్కోణపు సిరీస్‌: బంగ్లాదేశ్‌ ముందు 215 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన శ్రీలంక

  • టాస్ గెలిచి మొదట శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన బంగ్లాదేశ్
  • కుషల్ మెండీస్ 57, కుషల్ పెరీరా74 , ఉపుల్ తరంగా 32 పరుగులు
  • బంగ్లాదేశ్‌ బౌలర్లలో ముస్తాఫిజుర్‌కి 3, మహ్మదుల్లాకి 2, తస్కిన్‌కి 1 వికెట్
శ్రీలంక వేదికగా భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య ముక్కోణపు టీ20 సిరీస్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. శ్రీలంక బ్యాట్స్ మెన్ కుషల్ మెండీస్ 57, కుషల్ పెరీరా74 , ఉపుల్ తరంగా 32 పరుగులతో బంగ్లాదేశ్ బౌలర్లను బెదరగొట్టారు. మిగతా బ్యాట్స్ మెన్ లో గుణతిలక 26, షనకా 0, చండిమాల్ 2, తిషార పెరీరా 0, జీవన్ మెండీస్ 6 పరుగులు చేశారు. దీంతో బంగ్లాదేశ్ ముందు శ్రీలంక 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ మూడు వికెట్లు తీయగా, మహ్మదుల్లా రెండు, తస్కిన్‌ అహ్మద్ ఒక వికెట్ తీశాడు.
Sri Lanka
Bangladesh
Cricket

More Telugu News