ప్రొ.కోదండరామ్, చాడ వెంకట రెడ్డితో పాటు పలువురి అరెస్టు.. తీవ్ర ఉద్రిక్తత
- హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్దకు వెళ్లే ప్రయత్నం చేసిన నేతలు
- కోదండరామ్‌ను బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలింపు
- పోలీసులు, నేతలకు మధ్య వాగ్వివాదం
దీంతో అక్కడ పోలీసులు, కోదండరామ్ కి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కోదండరామ్ ను బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు ట్యాంక్ బండ్ కు బయలుదేరిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్న మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి ఆయనను తరలించారు. అరెస్టుల సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చెలరేగాయి.