చీకట్లో మగ్గిపోతున్న అమెరికా.. అంధకారంలో 50 లక్షల మంది!
- అమెరికాలో ఎన్నడూ లేని పరిస్థితులు
- విద్యుత్ లేక, కనీస అవసరాలు తీరక ప్రజలు ఇబ్బందులు
- వచ్చే వారం మరో మంచు తుపాను
- వేలాది విమానాలు రద్దు
మరోవైపు ప్రతికూల వాతావరణం కారణంగా అమెరికా వ్యాప్తంగా 2,700 విమాన సర్వీసులు రద్దు కాగా, 2400 విమానాలు ఆలస్యంగా నడిచాయి. మంచు తుపాను తాకిడికి గ్రామీణ ప్రాంతాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. విద్యుత్ లేక, ఆహార పదార్థాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరుసగా రెండు తుపాన్లతో అల్లాడుతుంటే వచ్చే వారం మరో తుపాను వచ్చే అవకాశం ఉందన్న వార్తలతో ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు.