కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో యంగ్ హీరో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో యంగ్ హీరో

  • హీరోగా తెరపైకి గల్లా జయదేవ్ తనయుడు 
  • అమెరికాలో శిక్షణ పొందిన అశోక్ గల్లా 
  • దిల్ రాజు నిర్మాణంలో ఫస్టు మూవీ      
సూపర్ స్టార్ కృష్ణ మనవడు (రమేశ్ బాబు తనయుడు) జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా కొన్ని రోజుల క్రితం ఒక వార్త వచ్చింది. తాజాగా మరో మనవడు ( గల్లా జయదేవ్ తనయుడు) అశోక్ తెలుగు తెరకి త్వరలోనే పరిచయం కానున్నట్టు తెలుస్తోంది. గుంటూరు ఎంపీగా రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తి గల్లా జయదేవ్. ఆయన నిన్న తెలుగుదేశం కార్యాలయానికి తన తనయుడు అశోక్ ను తీసుకుని వచ్చారు.

మురళీమోహన్ తో పాటు అక్కడున్న వాళ్లంతా అశోక్ గల్లాను ఆప్యాయంగా పలకరించారు. అశోక్ గల్లా అభిరుచిని గురించి గల్లా జయదేవ్ ను అడిగారు. అతణ్ణి హీరోను చేయనున్నట్టు గల్లా జయదేవ్ చెప్పారు. సినిమా రంగానికి సంబంధించిన వివిధ కోర్సుల్లో అశోక్ గల్లా అమెరికాలో శిక్షణ తీసుకున్నాడని అన్నారు. అశోక్ గల్లా మొదటి సినిమాను దిల్ రాజు నిర్మిస్తారనీ .. రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన ఆర్.కె. అనే యువ దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తాడని చెప్పారు. దాంతో అక్కడున్న వాళ్లంతా హీరోగా అశోక్ గల్లా రాణించాలనే అభిలాషను వ్యక్తం చేశారు. ఒకరకంగా చెప్పాలంటే కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో నట వారసుడు వచ్చేస్తున్నాడన్న మాట.         
ashokgalla

More Telugu News