తేజ మూవీలో వెంకటేశ్ లుక్ ఇదే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తేజ మూవీలో వెంకటేశ్ లుక్ ఇదే!

  • తేజ దర్శకత్వంలో వెంకటేశ్ 
  • కథానాయికగా శ్రియ 
  • వచ్చేవారం నుంచి రెగ్యులర్ షూటింగ్
వెంకటేశ్ హీరోగా తేజ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'ఆట నాదే వేట నాదే' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. వచ్చేవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలుకానుంది. ఈ సినిమాలో వెంకటేశ్ ప్రొఫెసర్ గా కనిపించనున్నాడు. అందుకు సంబంధించిన లుక్ ఒకటి వెంకటేశ్ ట్విట్టర్ లో కనిపిస్తోంది.

 కొత్త హెయిర్ స్టైల్ తో .. గెడ్డంతో .. స్పెట్స్ పెట్టుకుని ఆయన చాలా డీసెంట్ గా కనిపిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వెంకటేశ్ అభిమానులు ఖుషీ అయ్యేలా ఈ లుక్ వుంది. వెంకటేశ్ సరసన శ్రియ నటిస్తుండగా .. ఒక కీలకమైన పాత్రలో నారా రోహిత్ కనిపించనున్నాడు. ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందనే నమ్మకంతో వెంకటేశ్ ఉండటం విశేషం.
venkatesh
shriya

More Telugu News