టీడీపీ మాతో ఉన్నా లేకపోయినా ఏపీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది: రఘురాం
- టీడీపీ ఇప్పటికీ మా మిత్రపక్షమే
- మంత్రులుగా అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి ఎంతో నిజాయతీగా పని చేశారు
- ఎంపీ తోట నర్సింహం విలువల గల వ్యక్తి
టీడీపీ తమతో ఉన్నా లేకపోయినా ఏపీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై ఉందని అన్నారు. ఈ సందర్భంగా తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి గురించి రఘురాం ప్రస్తావించారు. కేంద్ర కేబినెట్ లో మంత్రులుగా ఉన్నంత కాలం వీళ్లిద్దరూ ఎంతో నిజాయతీగా పని చేశారని, టీడీపీ ఎంపీ తోట నర్సింహం విలువలు గల వ్యక్తని ప్రశంసించారు.