Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీడీపీ మాతో ఉన్నా లేకపోయినా ఏపీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది: రఘురాం

  • టీడీపీ ఇప్పటికీ మా మిత్రపక్షమే
  • మంత్రులుగా అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి ఎంతో నిజాయతీగా పని చేశారు
  • ఎంపీ తోట నర్సింహం విలువల గల వ్యక్తి  
ఏపీకి జరిగిన అన్యాయం గురించి ప్రధానమంత్రికి స్వయంగా తెలుసని బీజేపీ నేత రఘురాం అన్నారు. ఓ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ తమ ప్రభుత్వంలో లేదనే కానీ, తమకు ఇప్పటికీ మిత్రపక్షమేనని అన్నారు. ఎన్డీఏలో ఉన్న వాళ్లు బయటకు వెళ్లిపోయినా లేదా కొత్తవాళ్లు వచ్చి చేరినా తమకు సంతోషమేనని అన్నారు.

టీడీపీ తమతో ఉన్నా లేకపోయినా ఏపీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై ఉందని అన్నారు. ఈ సందర్భంగా తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి గురించి రఘురాం ప్రస్తావించారు. కేంద్ర కేబినెట్ లో మంత్రులుగా ఉన్నంత కాలం వీళ్లిద్దరూ ఎంతో నిజాయతీగా పని చేశారని, టీడీపీ ఎంపీ తోట నర్సింహం విలువలు గల వ్యక్తని ప్రశంసించారు.
bjp
raghuram

More Telugu News