అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు భేటీ.. మరో కీలక ప్రకటన?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు భేటీ.. మరో కీలక ప్రకటన?

  • భేటీలో సోమిరెడ్డి, దేవినేని, ప్ర‌త్తిపాటి, న‌క్కా ఆనంద‌బాబు
  • చంద్ర‌బాబుకు మోదీ ఫోన్ చేసిన నేప‌థ్యంలో భేటీకి ప్రాధాన్య‌త 
  • భవిష్యత్‌ కార్యచరణపై చంద్రబాబు చర్చ
టీడీపీ జాతీయాధ్య‌క్షుడు, ఆంధ‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి ఆదేశాల మేర‌కు త‌మ కేంద్ర మంత్రి ప‌దవుల‌కు అశోక్ గ‌జ‌ప‌తి రాజు, సుజ‌నా చౌద‌రి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాల‌ని, విభజన హామీలను అమలు చేయాల‌ని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వంతో మ‌రింత ఉద్ధృతంగా పోరాడాల‌ని నిర్ణ‌యం తీసుకున్న చంద్ర‌బాబు నాయుడు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న మంత్రుల‌తో మ‌రో కీల‌క భేటీ ఏర్పాటు చేశారు.

 ఈ స‌మావేశంలో మంత్రులు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు, ప్ర‌త్తిపాటి పుల్లారావు, న‌క్కా ఆనంద‌బాబు పాల్గొన్నారు. చంద్ర‌బాబుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఫోన్ చేసిన నేప‌థ్యంలో ఈ భేటీకి ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. ఈ భేటీలో టీడీపీ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని తెలుస్తోంది. తదుపరి ఎలా ముందుకు వెళ్లాలో చంద్రబాబు చర్చిస్తున్నట్లు సమాచారం.
Chandrababu
Andhra Pradesh
Special Category Status

More Telugu News