Sujana Chowdary: రాజీనామా లేఖలతో.. ప్రధాని కార్యాలయానికి చేరుకున్న అశోక్‌ గజపతి రాజు, సుజనా చౌదరి

టీడీపీ నేతలు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయడానికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కార్యాల‌యానికి చేరుకున్నారు. కొద్ది సేప‌టి క్రిత‌మే న‌రేంద్ర మోదీ త‌న రాజ‌స్థాన్ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని వ‌చ్చారు. ఇప్ప‌టికే రాజీనామా లేఖ‌ల‌ను సిద్ధంగా ఉంచుకున్న అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి ఒకే కారులో ప్ర‌ధాని కార్యాల‌యానికి వెళ్లారు. అంత‌కు ముందే ఇరువురు నేత‌లు మోదీ అపాయింట్ తీసుకున్న విష‌యం తెలిసిందే. తాము ఏయే కార‌ణాల వ‌ల్ల కేంద్ర మంత్రి వ‌ర్గం నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నామో మోదీకి తెలప‌నున్నారు. 
Sujana Chowdary
ashok gajapati
Narendra Modi

More Telugu News