తన కారుపై మూత్ర విసర్జన చేశాడంటూ.. పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన కారుపై మూత్ర విసర్జన చేశాడంటూ.. పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు!

  • హీరోయిన్ మోనల్ గజ్జర్ కు షాకింగ్ అనుభవం
  • కారు టైరుపై మూత్రం పోసిన వ్యక్తి
  • అహ్మదాబాదులో ఘటన
తన కారు టైరుపై మూత్ర విసర్జన చేశాడని ఆరోపిస్తూ హీరోయిన్ మోనల్ గజ్జర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ షాపింగ్ మాల్ నుంచి తాను బయటకు వస్తున్న సమయంలో... సదరు వ్యక్తి ఈ పాడు పని చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే, తన స్నేహితురాలితో కలసి అంబావాడీ ప్రాంతంలో ఉన్న ఓ షాపింగ్ మాల్ కు మోనల్ వెళ్లింది. మాల్ ఎదుట ఉన్న ప్రదేశంలో కారును పార్క్ చేసింది. షాపింగ్ పూర్తి చేసుకుని వస్తుండగా, ఓ వ్యక్తి తన కారు టైరుపై మూత్ర విసర్జన చేస్తుండటాన్ని గమనించింది. వెంటనే కంగారు పడ్డ ఆమె... అతడిని వారించే ప్రయత్నం చేసింది.

అయినా, అతను పట్టించుకోకుండా, పని పూర్తి చేసేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాల్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో సదరు వ్యక్తి ఓ దుకాణాన్ని నిర్వహిస్తుంటాడని పోలీసులు తెలిపారు. గుజరాత్ కు చెందిన మోనల్ గజ్జర్... టాలీవుడ్ లో 'వెన్నెల వన్ అండ్ హాఫ్, 'సుడిగాడు', 'బ్రదరాఫ్ బొమ్మాళి' తదితర చిత్రాల్లో నటించింది. 
monal gajjar
tollywood
car

More Telugu News