చంద్రబాబు రాజకీయ మైలేజీ కోసం తీసుకున్న నిర్ణయమిది: విష్ణుకుమార్ రాజు
- ఏపీకి హోదా ద్వారా వచ్చే నిధులను వేరే రూపంలో ఇస్తామని కేంద్రం చెప్పింది
- ప్రజల సెంటిమెంట్ గుర్తిస్తాము కానీ రాజకీయాల కోసం వాడుకోము
- హోదా, సెంటిమెంట్ పేరు చెప్పి కేబినెట్ నుంచి వైదొలగడం సరికాదు
హోదా, ప్రజల సెంటిమెంట్ పేరు చెప్పి బాబు కేంద్ర కేబినెట్ నుంచి వైదొలగడం సరికాదని ఆయన హితవు పలికారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రభుత్వంలో లేకపోయినా రాష్ట్రం కోసమే ఆలోచిస్తున్నారని ఆయన చెప్పారు. పది సంవత్సరాల్లో ఇస్తామన్న వాటిలో 85 శాతాన్ని బీజేపీ మూడున్నరేళ్లలో ఇచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రాన్ని తప్పుదోవ పట్టించారనడం సరికాదని ఆయన సూచించారు.