Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎక్కడో ఏదో జరిగింది .. అందుకే నాకు అవకాశాలు రావడం లేదు: హాస్య నటుడు శివారెడ్డి

  • ఎప్పుడూ ఎవరినీ డిమాండ్ చేయలేదు 
  • అయినా ఛాన్సులు రావడం లేదు 
  • ఈ విషయంలో ఎవరినీ నిందించడం లేదు
కెరియర్ ఆరంభంలో వరుస సినిమాలు చేస్తూ వచ్చిన శివారెడ్డికి .. ఆ తరువాత అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అదే విషయాన్ని గురించిన ప్రస్తావన 'ఐ డ్రీమ్స్' ఇంటర్వ్యూలో వచ్చింది. అప్పుడు శివారెడ్డి స్పందిస్తూ .. "కెరియర్ ప్రారంభంలోనే డిఫరెంట్ షేడ్స్ తో కూడిన పాత్రలను చేశాను .. సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేస్తూ వచ్చాను. నటన పరంగా వేరియేషన్స్ చూపిస్తూ వచ్చినా, నాకు అవకాశాలు రావడం లేదు"

 "దర్శక నిర్మాతలను ఏ విషయంలోను నేను డిమాండ్ చేయలేదు. కారవాన్ ఉంటేనే వస్తాను .. చెక్ ఇస్తేనే డబ్బింగ్ చెబుతాను .. ఇంత ఎమౌంట్ ఇస్తేనే చేస్తానని ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంతే ఇవ్వండి అంటూ చెబుతున్నా ప్రయోజనం లేదు. ఎక్కడో ఏదో జరిగింది .. అదేంటో నాకు తెలియడం లేదు. ఈ విషయంలో నేను ఎవరినీ నిందించడం లేదు .. భగవంతుడు నన్ను మిమిక్రీకి మాత్రమే పరిమితం చేశాడని అనుకుంటాను .. అంతే" అంటూ చెప్పుకొచ్చాడు.     
shivareddy

More Telugu News