Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదు: చంద్రబాబు విమర్శలు

  • మౌలిక వసతులకు రూ. 42,900 కోట్లు అవసరమైతే.. రూ. 5,349 కోట్లు ఇచ్చారు
  • విద్యాసంస్థలకు కూడా ఇచ్చిందేమీ లేదు
  • రైల్వే జోన్ ను ఇవ్వాల్సిందే
విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయని నేరుగా ప్రధాని మోదీకి ఫోన్ చేసి చెప్పానని... అయినా ఫలితం లేకపోయిందని అన్నారు. ఏపీకి రావాల్సిన రెవెన్యూ లోటు నిధులను ఇచ్చేశామని చెప్పారని... గట్టిగా అడిగితే లెక్కలు ఇవ్వలేదని బుకాయిస్తున్నారని విమర్శించారు.

కాగ్ నివేదిక ప్రకారం లోటును భర్తీ చేయాలని మళ్లీ కోరుతున్నానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ. 13000 కోట్లు ఖర్చయితే... కేంద్రం నుంచి ఇప్పటి వరకు కేవలం రూ. 5,349 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం ఖర్చు కేంద్రమే భరించాల్సి ఉందని చెప్పారు.

పోలవరం, అమరావతికి ఇచ్చిన నిధులకు లెక్కలు పంపించామని చంద్రబాబు తెలిపారు. అమరావతికి రూ. 2,500 కోట్లు ఇచ్చారని, ఆ లెక్కలు పంపించామని అన్నారు. మౌలిక వసతులకు రూ. 42,900 కోట్లు ఖర్చవుతాయని... ఇప్పటి వరకు కేవలం రూ. 1500 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు.

యూసీలు ఇవ్వడం లేదు కాబట్టే నిధులు ఇవ్వడం లేదు అని చెప్పడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత ఆరు నెలల్లో విశాఖ రైల్వే జోన్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారని... ఎన్నో కమిటీలు వేశారని... కానీ ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే జోన్ ను ఎట్టి పరిస్థితుల్లోను ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీని పెండింగ్ లో పెట్టారని అన్నారు.

ఐఐటీ తిరుపతికి రూ. 100 కోట్లు మాత్రమే ఇచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. 11 జాతీయ విద్యాసంస్థలకు రూ. 11 వేల కోట్ల విలువైన భూములను ఇచ్చామని... వీటి ఏర్పాటుకు రూ. 11,500 కోట్లు ఖర్చవుతుండగా... కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.  400 కోట్లు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. దుగరాజపట్నం పోర్టు కుదరదంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సీట్లను పెంచుతామన్న హామీ కూడా నెరవేరలేదని చెప్పారు. ఏపీలో ఉన్న కొన్ని సంస్థల పన్నులు తెలంగాణకు వెళుతున్నాయని... ఈ తప్పులను కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు. 
Chandrababu
railway zone
amaravathi
polavaram
assembly

More Telugu News