కొంతమంది డబ్బులు ఎగ్గొట్టారు .. ఏం చేస్తాం!: కమేడియన్ శివారెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొంతమంది డబ్బులు ఎగ్గొట్టారు .. ఏం చేస్తాం!: కమేడియన్ శివారెడ్డి

  • కొంతమంది నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు 
  • స్టేజ్ షో నిర్వాహకులు కొందరు ఎగ్గొట్టారు 
  • ఏం చేస్తాం .. రీసెంట్ గాను అలాగే జరిగింది    
హాస్య నటుడిగా .. మిమిక్రీ ఆర్టిస్ట్ గా శివారెడ్డికి మంచి క్రేజ్ వుంది. తెరపైనా .. స్టేజ్ పైనా సందడి చేస్తూ, నవ్వులు పూయించడంలో ఆయనకంటూ ఎంతో ప్రత్యేకత వుంది. అలాంటి శివారెడ్డి తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ముచ్చటించారు. "నా మంచితనం వలన కొంతమంది నిర్మాతలు .. కొంతమంది స్టేజ్ షో నిర్వాహకులు డబ్బులు ఎగ్గొట్టిన సందర్భాలు వున్నాయి" అన్నాడు.

 "ఒక స్టేజ్ షో చేయడానికి ఎంతో కష్టపడవలసి వస్తుంది. ఆ కష్టాన్ని స్టేజ్ షో నిర్వాహకులు దగ్గరగా చూస్తారు  .. చాలా బాగా చేశారంటూ అభినందిస్తారు కూడా .. కానీ డబ్బుల దగ్గరికి వచ్చేసరికి మామూలే. నా టీమ్ కి నేను డబ్బులు ఆపను .. ముందుగానే ఇచ్చేస్తాను. కానీ ఒక్కోసారి షో నిర్వాహకులు నాకు ఎగ్గొట్టేస్తారు. తరువాత ఇస్తామని చెబుతారు .. అంతే సంగతులు .. ఏం చేస్తాం? రీసెంట్ గా కూడా విజయవాడ స్టేజ్ షోలోను ఇలాంటి అనుభవమే ఎదురైంది " అని చెప్పుకొచ్చాడు.    
shivareddy

More Telugu News