పారితోషికం తగ్గించేసుకున్న రకుల్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పారితోషికం తగ్గించేసుకున్న రకుల్?

  • తెలుగులో రకుల్ కి తగ్గిన అవకాశాలు 
  • తమిళ సినిమాలపై దృష్టి 
  • కార్తీ .. సూర్య జోడీగా ఛాన్సులు    
చిన్న సినిమాతో .. చిన్న హీరోతో కథానాయికగా రకుల్ ప్రస్థానం మొదలైంది. ఆ తరువాత ఆమె అగ్రకథానాయకుల సరసన అవకాశాలను సంపాదించుకోవడానికీ .. స్టార్ హీరోయిన్ అనిపించుకోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. తెలుగులో  వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తూ వస్తోన్న ఆమెకి, కొత్త కథానాయికల పోటీ కారణంగా అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి.

తాను అందుకునే పారితోషికం భారీగా ఉండటం కూడా అవకాశాలు తగ్గడానికి ఒక కారణమనే విషయం రకుల్ కి అర్థమైపోయింది. దాంతో ఆమె తన పారితోషికాన్ని తగ్గించుకున్నట్టుగా తెలుస్తోంది. కథా కథనాలు .. తన పాత్ర బాగుంటే చాలంటూ మాట మార్చేసిందని అంటున్నారు. తెలుగులో కొత్త కథానాయికల జోరు పెరుగుతూ ఉండటంతో ఈ సుందరి, తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది. ఈ కారణంగానే కార్తీ సరసన మరోమారు ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు సూర్య సినిమాలోను అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం. తెలివైన రకుల్ ఖాళీగా ఉంటుందా ఏంటి?      
rakul

More Telugu News