శ్రీదేవిపై డాక్యుమెంటరీ ఆలోచనలో బోనీకపూర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీదేవిపై డాక్యుమెంటరీ ఆలోచనలో బోనీకపూర్

  • శ్రీదేవి బయోపిక్ పై నిర్మాతల దృష్టి 
  • బోనీ కపూర్ దగ్గర ఆ ప్రస్తావన 
  • తన అభిప్రాయం చెప్పిన బోనీ కపూర్ 
తెలుగు .. తమిళ .. హిందీ భాషా చిత్రాల్లో కథానాయికగా శ్రీదేవి వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిది. బాలనటి నుంచి కథానాయికగా ఆమె అంచలంచెలుగా ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం. అలాంటి శ్రీదేవి అభిమానులందరిని శోక సంద్రంలో ముంచేస్తూ అనంతలోకాలకు తరలిపోయింది. ఆమె హఠాన్మరణంతో షాక్ కి గురైన బోనీ కపూర్ .. ఇప్పుడిప్పుడే ఈలోకంలోకి వస్తున్నారట.

ఈ నేపథ్యంలో సన్నిహితులైన కొంతమంది నిర్మాతలు .. శ్రీదేవి బయోపిక్ చేస్తామనే విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావించారట. శ్రీదేవి జీవితం సముద్రమంత .. ఆమె జీవితంలోని మలుపులను రెండు గంటల్లో చెప్పడం కష్టం. అందువలన శ్రీదేవిపై డాక్యుమెంటరీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆయన ఈ ప్రాజెక్టును తనకి మంచి స్నేహితుడైన శేఖర్ కపూర్ కి అప్పగించినట్టు తెలుస్తోంది.  
sridevi
boney kapoor

More Telugu News