ప్రత్యేక హోదా గురించి చంద్రబాబుని విమర్శిస్తాడేంటి?.. బీజేపీ గురించి జగన్ ఎందుకు మాట్లాడరు?: హీరో శివాజీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రత్యేక హోదా గురించి చంద్రబాబుని విమర్శిస్తాడేంటి?.. బీజేపీ గురించి జగన్ ఎందుకు మాట్లాడరు?: హీరో శివాజీ

  • ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి పోరాడుతుంటే కూడా జ‌గ‌న్ మ‌ద్ద‌తు తెల‌ప‌డంలేదు
  • వ‌ప‌న్ క‌ల్యాణ్ కూడా ప్ర‌త్యేక హోదా కోసం నిల‌దీయ‌ట్లేదు 
  • తెలంగాణ త‌ర‌హాలో ఉద్యమం చేయాలి
  • ప్ర‌త్యేక హోదా సాధించుకోవ‌చ్చు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏపీకి ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడుతూ చంద్ర‌బాబుని విమ‌ర్శిస్తాడేంట‌ని సినీన‌టుడు, ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి నేత శివాజీ ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ బీజేపీ గురించి ఎందుకు మాట్లాడ‌డం లేద‌ని నిల‌దీశారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి పోరాడుతుంటే కూడా జ‌గ‌న్ మ‌ద్ద‌తు తెల‌ప‌డంలేద‌ని అన్నారు. అలాగే, పవన్ క‌ల్యాణ్ కూడా ప్ర‌త్యేక హోదా కోసం కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌డం లేద‌ని విమ‌ర్శించారు. తెలంగాణ త‌ర‌హాలో ఉద్యమం చేస్తే ప్ర‌త్యేక హోదా సాధించుకోవ‌చ్చ‌ని అన్నారు. నాయకులు హోదా కోసం పోరాడితే ప్ర‌జ‌లు వారి వెన‌కాలే ఉంటార‌ని అన్నారు.
Chandrababu
Andhra Pradesh
Jagan
shivaji

More Telugu News