చంద్రబాబును అనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో: విష్ణుకుమార్ రాజుకు టీడీపీ కౌంటర్
- చంద్రబాబును విమర్శించిన విష్ణుకుమార్ రాజు
- ఆయన వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు
- దమ్ముంటే విభజన హామీలను అమలు చేయించండి
- లేకుంటే కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందని విమర్శలు
బీజేపీ నేతలు తమ వైఖరిని మార్చుకుని కేంద్రంపై ఒత్తిడిని పెంచేందుకు సహకరించాలని, లేకుంటే వారికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. పార్లమెంట్ లో వైసీపీ చేస్తున్న పోరాటంలో చిత్తశుద్ధి ఎంతమాత్రమూ లేదని వ్యాఖ్యానించిన ఆంజనేయులు, జగన్ కేవలం అధికారం కోసమే పాదయాత్ర చేస్తున్నాడని, ఆయన కోరిక నెరవేరే పరిస్థితి లేదని అన్నారు.