Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సిగ్గుచేటు! అక్రమ సంబంధం పెట్టుకున్నాడని మూత్రం తాగించే ప్రయత్నం.. ఆత్మహత్యాయత్నం

  • అక్రమ సంబంధం విషయంలో యువకుడిని దోషిగా తేల్చిన పంచాయతీ
  • శిక్షగా మూత్రం తాగించే యత్నం
  • ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు
వివాహేతర సంబంధం ఆరోపణలపై ఓ యువకుడితో మూత్రం తాగించే ప్రయత్నం చేయగా అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో జరిగిందీ ఘటన. స్థానిక ఇందిరా కాలనీకి చెందిన యువకుడు ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తేల్చిన గ్రామ పంచాయతీ పెద్దలు అతడితో బలవంతంగా మూత్రం తాగించే ప్రయత్నం చేశారు. దీంతో అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు.

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మాట్లాడుతూ, తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపడేశాడు. తనకెవరితోనూ వివాహేతర సంబంధాలు లేవన్నాడు. వారు ఆరోపిస్తున్న ఆ యువతి ఎవరో కూడా తనకు తెలియదని, తమ ఇద్దరికి సంబంధం అంటగట్టారని వాపోయాడు. తనను దోషిగా తేల్చి మూత్రం తాగించే ప్రయత్నం చేశారని ఆరోపించాడు. తనను చంపేస్తారేమోనని భయపడుతున్న యువకుడు ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవాలని కోరాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడిపై దాడిచేసినట్టు తమకు సమాచారం అందిందని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని షహరాన్‌పూర్ ఎస్పీ బబ్లూ కుమార్ తెలిపారు.
suicide
Uttar Pradesh
Urine

More Telugu News