భారత ఆర్మీ మెరుపుదాడి.. సుంజువాన్ దాడికి ప్రతీకారం.. ఉగ్రవాది ముఫ్తీ వఖాస్ హతం

  • గత నెలలో సుంజువాన్ ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి
  • ఐదుగురు అధికారుల వీర మరణం
  • భారత సైన్యం మెరుపు దాడిలో సుంజువాన్ సూత్రధారి హతం
గత నెలలో సుంజువాన్ ఆర్మీ క్యాంపుపై జరిగిన దాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి అయిన జైషే మహమ్మద్ ఉగ్రవాది ముఫ్తీ వఖాస్‌ను సోమవారం సాయంత్రం హతమార్చింది. దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపొరలోని హత్వార్ ప్రాంతంలోని ఓ ఇంటిలో ఉగ్రవాది దాక్కున్నట్టు సమాచారం అందుకున్న సైన్యం ఆ ఇంటిని చుట్టుముట్టింది. ఈ మెరుపు దాడిలో వఖాస్ హతమైనట్టు అధికారులు తెలిపారు. ఈ దాడిలో పౌరులకు ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు.

సుంజువాన్‌ ఉగ్రదాడితోపాటు లత్పోరలోని సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై జరిగిన ఆత్మాహుతి దాడికి కూడా వఖాసే సూత్రధారి. పాకిస్థాన్‌కు చెందిన వఖాస్ 2017లో కశ్మీర్‌లోకి చొరబడ్డాడు. జైషే ఆపరేషనల్ కమాండర్‌గా పనిచేస్తున్నాడు. గత నెలలో జరిగిన సుంజువాన్ ఉగ్రదాడిలో ఇద్దరు జూనియర్ కమిషన్డ్ అధికారులు సహా ఐదుగురు సిబ్బంది అమరులయ్యారు.
Go Back to Shorts
Sunjuwan
Army camp
Terrorist
Attack
Indian Army

More Telugu News