నిజంగా రాజమౌళి ధైర్యానికి చప్పట్లు కొట్టాల్సిందే: కోడి రామకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిజంగా రాజమౌళి ధైర్యానికి చప్పట్లు కొట్టాల్సిందే: కోడి రామకృష్ణ

  • 'బాహుబలి'ని చూసి ఆశ్చర్యపోయాను 
  • అంత ఖర్చును నిర్మాత భరించడం విశేషం
  • మంచి అవుట్ పుట్ ఇవ్వడం రాజమౌళి గొప్పతనం
తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోడి రామకృష్ణ మాట్లాడుతూ .. 'బాహుబలి' సినిమాను గురించి ప్రస్తావించారు. " 'బాహుబలి'ని తీయడం అంత తేలికైన పనికాదు .. నిజం చెప్పాలంటే ఈ సినిమా చూస్తుంటేనే నాకు టెన్షన్ వచ్చేసింది. వేలమంది జూనియర్ ఆర్టిస్టులను ఎలా తీసుకొచ్చారు? .. ఎలా భోజనాలు పెట్టారు? అనే ఆలోచనలు వచ్చాయి.

'అంతమందితో అన్నేసి రోజుల షూటింగ్ అంటే నిర్మాతకి ఒక రేంజ్ లో టెన్షన్ ఉంటుంది. అలాంటి టెన్షన్ ను తట్టుకుని నిలబడిన నిర్మాతకి నేను ఎక్కువ మార్కులు ఇస్తాను. ఇక ఇంత టెన్షన్ లోను తన టైమింగ్ పోకుండా .. వెనుకంజ వేయకుండా రాజమౌళి తెరకెక్కించడం గొప్పవిషయం. నిర్మాత అంగీకరించడం ఒక విశేషమైతే .. తాను అనుకున్నది అనుకున్నట్టుగా రాజమౌళి తీయడం మరో విశేషం .. ఇద్దరినీ అభినందించవలసిందే' అన్నారు.  
kodi ramakrishna

More Telugu News