జాతీయ స్థాయిలో.. పలువురు ప్రముఖులతో కీలక భేటీ నిర్వహించనున్న కేసీఆర్

  • దేశ రాజకీయాలపై కేసీఆర్‌ ఆసక్తి
  • త్వర‌లో జాతీయ స్థాయిలో వివిధ సంస్థ‌లు, సంఘాల‌తో భేటీ
  • విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్‌ఎస్ అధికారులతో భేటీ
  • రక్షణ, వైమానిక శాఖల్లో పనిచేసిన విశ్రాంత అధికారులతోనూ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పలువురు ప్రముఖులతో కీలక భేటీ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. త్వర‌లో జాతీయ స్థాయిలో వివిధ సంస్థ‌లు, సంఘాలు, విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్‌ఎస్ అధికారులతో కేసీఆర్ భేటీ కానున్నారు. రక్షణ, వైమానిక శాఖల్లో పనిచేసిన విశ్రాంత అధికారులు, న్యాయవాదులు, రైతు సంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన భేటీ కానున్నారు.

అలాగే, దేశంలోని ఆర్థిక వేత్తలు, మీడియా సంస్థలు, పాత్రికేయులతో సమావేశం అయి పలు అంశాలపై చర్చిస్తారు. ఆ తరువాత  పారిశ్రామిక, కార్మిక సంస్థలతో వరుసగా సమావేశం జరుపుతారు.ఈ సమావేశాలను హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు తదితర నగరాల్లో  నిర్వహించనున్నారు.
Go Back to Shorts
KCR
Telangana
Hyderabad

More Telugu News