ఆ సీన్ చూసి మా నాన్న చాలా కంగారుపడిపోయారు: అల్లరి నరేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ సీన్ చూసి మా నాన్న చాలా కంగారుపడిపోయారు: అల్లరి నరేశ్

  • ఆ ఫైట్ లో నా చెవికి దెబ్బ తగిలింది 
  • అప్పుడు ఇంట్లో చెప్పలేదు 
  • కానీ ఆ తరువాత మా నాన్నకి తెలిసిపోయింది
హాస్యకథానాయకుడిగా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అల్లరి నరేశ్, తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడారు. 'శంభో శివ శంభో' సినిమా షూటింగులో జరిగిన ఒక సంఘటన గురించి ప్రస్తావించారు. " ఈ సినిమాలో ఐరన్ పైప్ అనిపించేలా వుండే ఓ ప్లాస్టిక్ పైప్ తో నా తలపై కొట్టాలి. అలా కొట్టడం వలన అది నా చెవికి తగిలింది. చెంప కమిలిపోవడమే కాకుండా కళ్ల వెంట నీళ్లు రావడం కూడా మొదలైంది.

షూటింగ్ అయిన తరువాత ఐస్ పెట్టుకున్నాను .. ఇంట్లో ఎవరికీ ఈ విషయం తెలియకుండా చూసుకున్నాను. కొంతకాలం తరువాత టీవీలో ఆ సీన్ వస్తుండగా మా నాన్న చూశారు. వెంటనే నాకు ఫోన్ చేసి పిలిపించారు. 'ఆ షాట్ లో దెబ్బ బాగా తగిలినట్టుగా నాకు అనిపిస్తోంది .. నిజం చెప్పు చెవికి ఏమైనా ఇబ్బంది అయిందా? .. డాక్టర్ దగ్గరికి వెళ్లి ఒకసారి చెక్ చేయిద్దామా'? అంటూ కంగారును వ్యక్తం చేశారు. అలాంటిదేంలేదంటూ నేను కూల్ చేశాను" అంటూ చెప్పుకొచ్చాడు.   
allari naresh

More Telugu News