శాంత్రో కారు తిరిగొస్తోంది కొత్త రూపంలో... ఈ ఏడాదే ఆవిష్కరణ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శాంత్రో కారు తిరిగొస్తోంది కొత్త రూపంలో... ఈ ఏడాదే ఆవిష్కరణ!

  • ఆగస్టులో ఆవిష్కరించే అవకాశం
  • ధర రూ.3 లక్షల్లోపే
  • ఆ తర్వాత నిలిచిపోనున్న ఇయాన్ మోడల్
హ్యుందాయ్ శాంత్రో కారు గుర్తుందా...? మారుతి ఆల్టోతో పోటీగా విక్రయాలు సాగించిన ఈ మోడల్ ఆ తర్వాత నిలిచిపోయింది. ఈ పాప్యులర్ మోడల్ ను మరోసారి తిరిగి ప్రవేశపెట్టేందుకు హ్యుందాయ్ కంపెనీ సన్నద్ధమవుతోంది. వచ్చే దీపావళి సీజన్ ను దృష్టిలో ఉంచుకుని ముందుగా అంటే ఈ ఏడాది ఆగస్టులో దీన్ని విడుదల చేయనున్నట్టు సమాచారం.

కొత్తగా రానున్న ఈ శాంత్రో ధర రూ.3 లక్షల్లోపే ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి దేశంలో అమలు కానున్న భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా హ్యుందాయ్ ఇయాన్ మోడల్ లేదు. దీంతో ఇయాన్ మోడల్ ను నిలిపివేసి దాని స్థానంలో శాంత్రోను హ్యుందాయ్ కంపెనీ ఆవిష్కరించనుంది. ఐ10 ప్లాట్ ఫామ్ పై 1086సీసీ ఇంజన్ తో 70బీహెచ్ పీ పవర్, 100 ఎన్ఎం టార్క్యూతో ఉండనుంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కూడా ఉంటుందని సమాచారం.
hyundai santro

More Telugu News