లాలూ కుమార్తె, అల్లుడికి ఊరట... బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు
- దేశం విడిచి వెళ్లరాదని షరతు
- 2008-09 నాటి ఫార్మ్ హౌస్ కొనుగోలు కేసు
- రూ.1.2 కోట్ల అక్రమ నగదు చలామణి జరిగినట్టు ఈడీ ఆరోపణ
షెల్ సంస్థల ద్వారా ఈ దంపతులు 1.2 కోట్ల మేర అక్రమంగా నగదు చలామణికి కుట్ర పన్నినట్టు ఈడీ ఆరోపణ. ఢిల్లీలో మీసా భారతి, ఆమె భర్త కలసి తమ కంపెనీ మిషైల్ ప్యాకర్స్ అండ్ ప్రింటర్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట కొనుగోలు చేసిన ఫార్మ్ హౌస్ కు సంబంధించిన కేసు ఇది. 2008-09లో జరిగిన ఈ లావాదేవీ రూపంలో రూ.1.2 కోట్ల అక్రమ నగదు చలామణి జరిగినట్టు ఈడీ ఆరోపిస్తోంది.