భర్తపై పోరాడుతున్న సంగీతపై మరోసారి దాడిచేసిన అత్తమామలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భర్తపై పోరాడుతున్న సంగీతపై మరోసారి దాడిచేసిన అత్తమామలు

  • కోర్టు ఆదేశాలతో భర్త ఇంట్లోనే ఉంటున్న సంగీత
  • అక్కను చూసేందుకు వచ్చిన సంగీత సోదరుడు
  • ఎందుకువచ్చావంటూ దాడి
ఇంటి నుంచి గెంటేసిన భర్త, టీఆర్ఎస్ మాజీ నేత కె.శ్రీనివాస్ రెడ్డిపై పోరాడుతున్న సంగీతపై ఆమె అత్తమామలు, మరిది మరోసారి దాడిచేశారు. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ సంగీత ఇటీవల కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. భర్త తన ఇంట్లో ఆమెను ఉంచుకోవడంతోపాటు, ఆమె ఖర్చులకు నెలకు రూ.20 వేలు చెల్లించాలంటూ  కోర్టు ఆదేశించింది. దీంతో ఆమె హైదరాబాద్ బోడుప్పల్  శ్రీనగర్ కాలనీలోని భర్త ఇంట్లోనే ఉంటున్నారు.

ఈ క్రమంలో ఆమెను చూసేందుకు ఆదివారం రాత్రి సంగీత సోదరుడు రంజిత్ రెడ్డి వచ్చాడు. గమనించిన శ్రీనివాస్ రెడ్డి సోదరుడు, సంగీత మరిది అయిన శ్రీధర్ రెడ్డి అతడిపై దాడికి దిగాడు. అతడి దాడిని సంగీత సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండడాన్ని చూసిన మరిది, అత్తమామలు ఆ ఫోన్‌ను లాక్కొని ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీంతో సంగీత వెంటనే వెళ్లి అత్తమామలు, మరిదిపై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మామ బాల్‌రెడ్డి, మరిది శ్రీధర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
Hyderabad
sangeetha
Attack
police

More Telugu News