నీరవ్ మోదీ ఎక్కడ... న్యూయార్క్ లో లేడా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నీరవ్ మోదీ ఎక్కడ... న్యూయార్క్ లో లేడా?

  • నీరవ్ మోదీ న్యూయార్క్ లో తలదాచుకున్నాడని వార్తలు
  • హాంగ్ కాంగ్ లో ఉన్నాడని భావిస్తున్న ఈడీ
  • ముంబైలోని పీఎంఎల్ఏ న్యాయస్థానానికి వెల్లడి
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ను వేలకోట్ల రూపాయలకు ముంచి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అమెరికాలో వున్నట్టు నిన్నటి వరకు ప్రచారం జరిగింది. అయితే, ఆయన ప్రస్తుతం హాంగ్ కాంగ్‌ లో ఉన్నట్లు ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులకు సమాచారం అందింది. విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ పలుమార్లు నీరవ్ మోదీకి సమన్లు జారీ చేసినప్పటికీ, ఉపయోగం లేకపోవడంతో ముంబైలోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక న్యాయస్థానంలో ఈడీ పిటిషన్‌ దాఖలు చేసింది.

దీనిని విచారించిన న్యాయస్థానం నీరవ్‌, ఆయన వ్యాపార భాగస్వామి మేహుల్‌ చోక్సీలపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నీరవ్‌ స్నేహితుడని, ఆ పరిచయంతోనే న్యూయార్క్‌ లో నీరవ్ ఏర్పాటు చేసిన వజ్రాభరణాల షోరూంను ఆమధ్య ట్రంప్ ప్రారంభించారని, నీరవ్ అమెరికాలోనే ఉన్నాడని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీఎంఎల్‌ఏ ప్రత్యేక న్యాయస్థానానికి నీరవ్ హాంగ్ కాంగ్ లో ఉన్నాడని భావిస్తున్నట్టు ఈడీ చెప్పడం ఆసక్తి రేపుతోంది.
nirav modi
ED
hongkong

More Telugu News