chennai: జయలలిత సమాధి వద్ద కలకలం .. ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కలకలం రేపింది. మధురైకి చెందిన అరుల్ అనే వ్యక్తి మెరీనా తీరం వద్ద ఉన్న జయలలిత సమాధి వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఈరోజు కూడా డ్యూటీ చేసే నిమిత్తం సమాధి వద్దకు చేరుకున్న అరుల్, తన రైఫిల్ తో కాల్చేసుకున్నాడు.
ఈ సంఘటనతో వెంటనే అప్రమత్తమైన డ్యూటీలో వున్న మిగిలిన పోలీసులు, అతన్ని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అరుల్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా, అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. సంఘటనా స్థలానికి చెన్నై నగర కమిషనర్ ఏకే విశ్వనాథన్ చేరుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.