2.0 సినిమా లీకులపై రజనీ కాంత్ కుమార్తె ఘాటు స్పందన... మతిలేని వారి పనంటూ విమర్శ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

2.0 సినిమా లీకులపై రజనీ కాంత్ కుమార్తె ఘాటు స్పందన... మతిలేని వారి పనంటూ విమర్శ

  • ఇది క్షమించరానిది
  • కొన్ని నిమిషాల ఆనందం కోసం ఇలా చేయడం తగదు
  • ట్విట్టర్ లో ట్వీట్
అగ్ర నటుడు రజనీకాంత్ నటించిన 2.0 సినిమాకు సంబంధించి ట్రైలర్, ఇతర కొన్ని దృశ్యాలు ఆన్ లైన్లో అందుబాటులోకి రావడంపై ఆయన కుమార్తె సౌందర్య రజనీకాంత్ గట్టిగా స్పందించారు. కొన్ని నిమిషాల ఆనందం కోసం నిర్మాతల కృషి, మనోభావాలు, వారి శ్రమను నీరుగార్చే మతిలేని చర్యగా ఆమె అభివర్ణించారు.

ఇలా ఆన్ లై న్ లో విడుదల చేయడం క్షమించరానిదని, ప్రోత్సహించరాదని ఆమె సూచించారు. ఈ మేరకు తన ట్విట్టర్ పేజీలో ఈరోజు ట్వీట్ చేశారు. భారీ బడ్జెట్ తో రజనీకాంత్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వస్తున్న 2.0 మూవీలోని కొన్ని దృశ్యాలను యూట్యూబ్ లో ఆకతాయిలు ఎవరో పోస్ట్ చేసి టీజర్ గా పేర్కొనడం గమనార్హం.
rajnikanth
2.0 movie

More Telugu News