రజనీకాంత్ '2.0'కు భారీ షాక్... లీకైన దృశ్యాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రజనీకాంత్ '2.0'కు భారీ షాక్... లీకైన దృశ్యాలు!

  • ఇదే టీజర్ అంటూ కొన్ని దృశ్యాలు
  • ఇప్పటికే విడుదలైన '2.0' పాటలు
  • ఇంటిదొంగల పనేనని అనుమానం
ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం '2.0' సినిమా పైరసీ బారిన పడింది. ఈ సినిమా పాటలు ఇప్పటికే విడుదల కాగా, టీజర్ కోసం ఆత్రుతగా అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

రజనీతో పాటు యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న చిత్రానికి సంబంధించిన కొన్ని సీన్లతో, డైలాగులతో కూడిన వీడియోను ఎవరో విడుదల చేశారు. ఇదే 'టీజర్ లీక్' అంటూ '2.0'లోని కొన్ని దృశ్యాలు ఈ ఉదయం విడుదల కావడం చిత్ర యూనిట్ కు షాకిచ్చింది. ఎవరో ఆన్‌ లైన్‌ దొంగలు ఈ పని చేయగా, కంప్యూటర్ మీద ఉన్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తుండటంతో ఇది ఇంటిదొంగల పనేనని అనుమానం వ్యక్తమవుతోంది.

ఇక సినిమా సీన్లు యూట్యూబ్ తదితర సోషల్ మీడియా చానళ్లలో వైరల్ అవుతుండటంతో, నిర్మాతల ఫిర్యాదు మేరకు వాటన్నింటినీ యూ ట్యూబ్ తొలగించింది. చాలా లింక్స్ లో ఈ వీడియో రాకపోయినా, అప్పటికే డౌన్ లోడ్ చేసుకున్న వందలాది మంది తిరిగి పోస్టులు చేస్తున్నారు. దీని వెనక ఉన్న మోసగాళ్లను పట్టుకోవాలని చిత్ర టీమ్ తమిళనాడు పోలీసులను కోరింది. జరిగిన నష్టాన్ని ఆపాలంటే వెంటనే అధికారిక టీజర్ ను విడుదల చేయాలని రజనీ అభిమానులు నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారు.
Rajanikant
2.0
Teaser
Leaked

More Telugu News