దటీజ్ మెగాస్టార్ చిరంజీవి స్టామినా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దటీజ్ మెగాస్టార్ చిరంజీవి స్టామినా!

  • అమెజాన్ ప్రైమ్ సొంతమైన 'సైరా' డిజిటల్ రైట్స్
  • రూ. 30 కోట్లు చెల్లించిన అమెజాన్
  • చిరంజీవి ఫ్యాన్స్ ఆనందం
ప్రస్తుతం తన 101వ చిత్రం 'సైరా'లో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో చిత్ర పరిశ్రమకు మరోసారి తెలిసొచ్చింది. తెల్లదొరలపై తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ రూ. 30 కోట్లు చెల్లించి సొంతం చేసుకుందట. ఫస్ట్ లుక్ నుంచి టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియోలు... సినిమాకు సంబంధించి డిజిటల్ మీడియా మాధ్యమంగా సాగే అన్ని కార్యక్రమాల హక్కులూ అమెజాన్ కు దక్కాయని తెలుస్తుండగా, ఆ సంస్థ ఇంత భారీ మొత్తం ఇచ్చి ఓ సినిమాను కొనడం ఇదే తొలిసారని సమాచారం. ఇక అమెజాన్ ప్రైమ్ సంస్థ 'సైరా'లో భాగస్వామ్యం అయిందని భారీ మొత్తాన్ని ఇచ్చిందని తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'వన్ అండ్ ఓన్రీ చిరంజీవి', 'మెగాస్టారా మజాకా', 'చిరంజీవికే అంతటి సత్తా ఉంది' అని కామెంట్లు పెడుతున్నారు.
Saira
Chiranjeevi
Amazon Prime
Digital Writs

More Telugu News