పాక్ న్యూస్ చానల్ ఘోర తప్పిదం.. సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాక్ న్యూస్ చానల్ ఘోర తప్పిదం.. సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు!

  • పాప్యులర్ పాప్ సింగర్‌ను మహిళగా మార్చేసిన చానల్
  • బ్రిటిష్ పాప్ క్వీన్‌గా వర్ణించిన వైనం
  • న్యూస్ చానల్ పరువు గంగపాలు
పాకిస్థాన్ న్యూస్ చానల్ ఒకటి ఘోర తప్పిదం చేసింది. బ్రిటిష్ పాప్ సింగర్, నాలుగుసార్లు గ్రామీ అవార్డులు అదుకున్న ఎడ్ షీరన్‌ను బ్రిటిష్ ‘పాప్ క్వీన్’గా పేర్కొని మహిళా సింగర్‌గా మార్చేసింది. ‘‘బ్రిటిష్ పాప్ క్వీన్ ఎడ్ షీరన్ 2017 బెస్ట్ ఫిమేల్ సింగర్‌గా ఎంపికయ్యారు’’ అని పేర్కొని పరువు తీసుకుంది. అంతేకాదు.. ఆయన ఫొటోను చూపిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం ఇంకో విశేషం.

ఇంగ్లిష్ పాటల రచయిత, గాయకుడు అయిన షీరన్‌కు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అటువంటి వ్యక్తి ఎవరో కూడా ఆ ఉర్దూ న్యూస్ చానల్‌ ‘ఎక్స్‌ప్రెస్ న్యూస్’కు తెలియకపోవడం విచారకరమని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మొత్తానికి పాక్ న్యూస్ చానళ్లు లింగ సమానత్వం (జెండర్ ఈక్వాలిటీ) పాటిస్తున్నాయని దుయ్యబడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చిరపరిచితుడైన వ్యక్తి కూడా ఎవరో తెలియకుండా న్యూస్ చానల్ నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చానల్ పరువును బజార్లో నిలబెట్టారు.

పాకిస్థాన్ మీడియా తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. ఇటీవల ఓ న్యూస్‌ చానల్‌లో ఇద్దరు న్యూస్ యాంకర్లు లైవ్‌లో పోట్లాడుకోవడం సంచలనమైంది. న్యూస్ బ్రేక్‌లోనే వారిద్దరూ ఒకర్నొకరు తిట్టుకున్నా కెమెరా ఆన్‌లోనే ఉండడంతో విషయం బయటకొచ్చింది.
Pakistan
news channel
Ed Sheeran
British pop queen

More Telugu News