20 ఏళ్లు సీఎం పదవిలో ఉన్న పేద వ్యక్తి... ఇక అధికారానికి దూరం!
- త్రిపురలో ఓటమిని చవిచూసిన మాణిక్ సర్కార్
- నరేంద్ర మోదీ హవాతో ప్రాభవాన్ని కోల్పోయిన సీపీఎం
- నేడు పదవికి రాజీనామా చేయనున్న మాణిక్
ఇప్పటికీ సొంత ఇల్లు లేని ఆయన, ముత్తాతకు చెందిన అతి చిన్న ఇంట్లో ఉంటూ, తనకు వచ్చే జీతాన్ని సీపీఎం పార్టీకి ఇస్తూ, పార్టీ ఇచ్చే రూ. 5 వేలు, తన భార్యకు వచ్చే పెన్షన్ తో నెట్టుకొస్తున్నారు. ప్రతి రోజూ ఓ చార్మినార్ సిగరెట్ ప్యాకెట్, కాస్తంత నస్యం ఉంటే తనకు పూట గడిచిపోతుందని చెప్పే మాణిక్ సర్కార్, రాష్ట్రంలో నిరుద్యోగం పెరగడం, అభివృద్ధి లేమితో ప్రజల్లో పెరిగిన అసహనం, కొనసాగుతున్న నరేంద్ర మోదీ హవా తదితర కారణాలతో అధికారానికి దూరమయ్యారు.