మాకు చెప్పిన ట్యూన్ వేరు.. సింగర్ పాడిన పాట ట్యూన్ వేరు!: కోడి రామకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాకు చెప్పిన ట్యూన్ వేరు.. సింగర్ పాడిన పాట ట్యూన్ వేరు!: కోడి రామకృష్ణ

  • ముందుగా మాకు వినిపించిన ట్యూన్ వేరు 
  • ఆ సింగర్ పాడిన ట్యూన్ వేరు 
  • ఆ విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేశాను
కోడి రామకృష్ణ తన కెరియర్లో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు. వినోదంతో సందేశాన్ని మేళవించి ఆయన తెరకెక్కించిన సినిమాలు ఎన్నో ప్రశంసలు తెచ్చిపెట్టాయి. అలాంటి కోడి రామకృష్ణ తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ .. సినిమా మంచిగా రావడానికి 'ఇగో'లు అడ్డుపడకూడదంటూ ఒక సంఘటన గురించి ప్రస్తావించారు.

" ఒకసారి ఒక ట్యూన్ ను నేను .. నిర్మాత గారు కలిసి ఓకే చేశాం. ఆయన పెద్ద సంగీత దర్శకుడు ..  పాడింది కూడా పెద్ద సింగరే .. అయితే ట్యూన్ మార్చేసి పాడారు. 'ఇలా జరిగిందేంటని అడిగితే .. ఇలాగే బాగుందని ఆ గాయకుడు అన్నారు. ఆయన మాటలను ఆ మ్యూజిక్ డైరెక్టర్ సమర్ధించారు. మార్చిన ట్యూన్ బాగాలేదని నేను నిర్మొహమాటంగా చెప్పేశాను .. ఆ నిర్మాత కూడా నన్ను సపోర్ట్ చేశారు. దాంతో ఆ సింగర్ మళ్లీ మాకు నచ్చిన ట్యూన్ లో పాడటం జరిగింది .. ఆ పాట సూపర్ హిట్ అయింది" అంటూ చెప్పుకొచ్చారు.    
kodi ramakrishna

More Telugu News