ఫిల్మ్ సిటీని ఫ్రీగా చూసేయవచ్చనే ఆశతో ఆడిషన్స్ కి వెళ్లాను!: హాస్యనటి గీతాసింగ్
- జై' ఆడిషన్స్ కి వెళ్లాను
- తేజ గారు చేయమన్న సీన్ చేసి చూపించాను
- ఫస్టు సీన్ కే అంతా నవ్వేశారు
"ఒక సీన్ ఇచ్చి చేయమంటే చేశాను గానీ .. నన్ను సెలెక్ట్ చేస్తారనే నమ్మకం నాకు లేదు. కానీ తేజ గారు నన్నే సెలెక్ట్ చేశారు .. వెంటనే ఇంటికి ఫోన్ చేసి చెబితే ఎవరూ నమ్మలేదు. అప్పుడే కాదు .. షూటింగ్ మొదలయ్యేవరకూ వాళ్లు నమ్మలేదు. ఫస్టు డే ఫస్టు సీన్ లో వేణు చేయి కొరికే సీన్ ఇచ్చారు నాకు .. చేశాను .. తేజతో సహా అంతా నవ్వారు. కాకపోతే ఇప్పటికీ వేణు చేతికి ఆ మచ్చ ఉండే ఉంటుంది" అంటూ నవ్వేశారు.