త్రిపురలో మేము ఊహించని స్ధానాల్లో కూడా గెలుస్తున్నాం: రామ్ మాధవ్
- త్రిపురలో 42 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ కూటమి
- వామపక్ష కూటమి ఆధిక్యంలో 16 స్థానాలు
- బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది
త్రిపురలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేత రామ్ మాధవ్ తెలిపారు. త్రిపురలో తాము ఊహించని స్థానాల్లో కూడా ఆధిక్యంలోకి వస్తున్నామని ఆయన అన్నారు. మెజారిటీ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబర్చడంతో బీజేపీ కార్యాలయాల్లో సందడి నెలకొంది. తుదిఫలితాల కోసం చూడకుండానే బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.