రక్తమోడిన బుర్కినా ఫాసో.. ఉగ్రదాడిలో 28 మంది దుర్మరణం
- ఫ్రెంచ్ రాయబార కార్యాలయం లక్ష్యంగా దాడి
- ఎదురు కాల్పుల్లో 8 మంది ఉగ్రవాదుల హతం
- ఇస్లామిక్ ఉగ్రవాదుల పనేనన్న ప్రభుత్వం
ఇది ఉగ్రదాడేనని బుర్కినాఫాసో ప్రభుత్వం ప్రకటించింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దేశంలో దాడి చేయడం 2016 నుంచి మూడోసారి. తాజా దాడికి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు. ఎంబసీ అధికారులు అంతా క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్-వెస్ లీ డ్రియన్ తెలిపారు.