14న జనసేన ఆవిర్భావం రోజు.. జన సైనికులమైన మనందరికీ పండుగ రోజు: పవన్ కల్యాణ్
- ప్రజాస్వామ్యవాదులకు వేడుకైన రోజు
- జనసేనను అభిమానించే వారందరూ ఒకచోట కలిసి ప్రజల సేవకు పునరంకితమయ్యే రోజు
- ప్రజా వేదిక నుంచి మాట్లాడే తరుణం ఆసన్నమవుతోంది
- సభకు వచ్చే వారు క్షేమంగా తిరిగి స్వస్థలానికి చేరుకునేలా అన్ని ఏర్పాట్లు
ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ గుంటూరులో నాగార్జునా యూనివర్సిటీ ఎదురుగా, 35 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతుందని ప్రకటన విడుదల చేశారు. సభకు వచ్చే ప్రతికార్యకర్త క్షేమంగా తిరిగి స్వస్థలానికి చేరుకునేలా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, నాయకులను స్మరించుకునేలా సభా ప్రాంగణం, స్వాగత తోరణాలకు పేర్లు ఉంటాయని పవన్ చెప్పారు.