ఇంకోసారి న‌న్ను 'బ‌చ్చా' అంటే ఏం స‌మాధానం చెబుతానో చూడండి!: మ‌ంత్రి కేటీఆర్ హెచ్చరిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంకోసారి న‌న్ను 'బ‌చ్చా' అంటే ఏం స‌మాధానం చెబుతానో చూడండి!: మ‌ంత్రి కేటీఆర్ హెచ్చరిక

  • మేము సూట్ వేసుకుని మాట్లాడితే అమెరికా భాష అని విమర్శిస్తారు
  • ప్రజల భాషలో మాట్లాడితే మరోలా విమర్శిస్తారు
  • ఇటీవల నేను చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు
  • నేను వారి గురించి అన్నీ వాస్తవాలే మాట్లాడాను  
తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ నేతలు విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. కేటీఆర్ గురించి తాను స్పందించి, ఆయన స్థాయికి దిగజారనని ఇటీవలే జానారెడ్డి అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీతో పాటు పలువురు ఆ పార్టీ నేతలు 'కేటీఆర్‌ ఓ బచ్చా' అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కేటీఆర్... ఇంకోసారి తనను బచ్చా అంటే ఏం సమాధానం చెబుతానో చూడండని హెచ్చరించారు. తాము సూట్ వేసుకుని మాట్లాడితే అమెరికా భాష అని విమర్శిస్తారని, ప్రజల భాషలో మాట్లాడితే మరోలా విమర్శిస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

తాను ఇటీవల చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారని, అయితే తాను వారి గురించి అన్నీ వాస్తవాలే మాట్లాడానని కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌ అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ నేతలు అయోమయంలో పడ్డారని ఎద్దేవా చేశారు.  
KTR
TRS
Jana Reddy
Congress

More Telugu News