శ్రీదేవిని ఆమె తల్లి ఇబ్బంది పెట్టిందనడంలో నిజం లేదు: బాబాయ్ వేణుగోపాల్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీదేవిని ఆమె తల్లి ఇబ్బంది పెట్టిందనడంలో నిజం లేదు: బాబాయ్ వేణుగోపాల్ రెడ్డి

  • శ్రీదేవి కోసం తల్లి ఎన్నో కష్టాలు పడింది 
  • తల్లి అంటే శ్రీదేవికి ఎంతో ఇష్టం 
  • శ్రీదేవికి ఆమె ఎంత చెబితే అంత
శ్రీదేవి చిన్నప్పటి నుంచి ఆమె బాబాయ్ వేణుగోపాల్ రెడ్డికి తెలుసు. ఆ రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం వుంది. శ్రీదేవి బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించడం దగ్గర నుంచి ..ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదగడం వరకూ ప్రత్యక్షంగా చూసినవారాయన. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ తో శ్రీదేవి గురించిన కొన్ని విషయాలను పంచుకున్నారు.

" శ్రీదేవిని సినిమా నటిని చేయాలనే ఆలోచనతో, ఆమెను అందంగా తీర్చిదిద్దడం కోసం తల్లి చాలా జాగ్రత్తలు తీసుకునేదట. అందువలన శ్రీదేవి చాలా ఇబ్బంది పడిందని అంటారు ..నిజమేనా?" అనే ప్రశ్న వేణుగోపాల్ రెడ్డికి ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ .. " శ్రీదేవిని నటిగా చేయడానికి ఆమె తల్లి చాలా కష్టాలు పడింది. అయితే ఆమె వలన శ్రీదేవి ఇబ్బందిపడిందనే మాటలో నిజం లేదు. ఎందుకంటే శ్రీదేవికి తన తల్లి అంటే ఎంతో ఇష్టం .. ఆమె ఎంత చెబితే అంత. ఆమెకి చెప్పకుండా శ్రీదేవి ఏం చేసేది కాదు. తన పట్ల తల్లి తీసుకునే శ్రద్ధని శ్రీదేవి ఎప్పుడూ ఇబ్బందిగా భావించింది లేదు" అని ఆయన చెప్పుకొచ్చారు.               
sridevi
venugopal reddy

More Telugu News