శ్రీదేవి అలా సినిమాల్లోకి వెళ్లింది: ఆమె బాబాయ్ వేణుగోపాల్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీదేవి అలా సినిమాల్లోకి వెళ్లింది: ఆమె బాబాయ్ వేణుగోపాల్ రెడ్డి

  • చిన్నప్పుడు శ్రీదేవి మా ఇంట్లో ఆడుకునేది
  • ఆమెను సినిమాల్లోకి పంపించాలనేది తల్లి ఆసక్తి 
  • శ్రీదేవి మొదట తమిళంలో .. ఆ తరువాత తెలుగులో చేసింది
శ్రీదేవి మరణించిందనే విషయాన్ని ఆమె అభిమానులు ఇప్పటికీ నమ్మలేకపొతున్నారు. వెండితెరను ఆమె ప్రభావితం చేసిన తీరును తలచుకుని బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి గురించిన విషయాలను ఆమె బాబాయ్ వేణుగోపాల్ రెడ్డి .. ఐ డ్రీమ్స్ తో పంచుకున్నారు. " చిన్నప్పుడు శ్రీదేవి వాళ్ల అమ్మతో కలిసి మా ఇంటికి వస్తూ వెళుతూ ఉండేది. మా ఇంట్లో ఆడుకునేది .. నేను ఆమెను ఎత్తుకుని తిరిగినవాడిని".

"శ్రీదేవి ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిందే. ఆమె తల్లికి సినిమా పరిశ్రమకి చెందిన ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా ఆమెకి సినిమాలపై ఒక అవగాహన కలిగింది. దాంతో శ్రీదేవిని సినిమాల్లోకి పంపించాలనే ఉద్దేశంతో అప్పటి నుంచి మరింత శ్రద్ధ తీసుకుంది. మొదట శ్రీదేవి ఒక తమిళ సినిమా చేసింది .. ఆ తరువాత తెలుగులో 'మా నాన్న నిర్దోషి'లో అవకాశం వచ్చింది. ఆ సినిమాతో మంచి పేరు రావడంతో, ఆమెకి వరుసగా అవకాశాలు వచ్చాయి' అని చెప్పుకొచ్చారు.        
sridevi
venugopal reddy

More Telugu News