ఇది నీ కెరియర్ .. నీ ఇష్టం అని నాన్న అన్నారు: అల్లరి నరేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇది నీ కెరియర్ .. నీ ఇష్టం అని నాన్న అన్నారు: అల్లరి నరేశ్

  • నా సినిమాల కథల ఎంపికలో నిర్ణయం నాదే 
  • మా నాన్న జోక్యం చేసుకునేవారు కాదు
  • 40కి పైగా సినిమాలు వేరే దర్శకులతో చేశాను
తెలుగు తెరపై హాస్య కథానాయకుడిగా రాజేంద్రప్రసాద్ తరువాత స్థానాన్ని అల్లరి నరేశ్ ఆక్రమించాడు. కెరియర్లో చాలా వేగంగా 50 సినిమాలను పూర్తి చేసిన అల్లరి నరేశ్, తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ అనేక విషయాలను ప్రస్తావించాడు. "మా ఫాదర్ చనిపోయిన తరువాత నాకు హిట్స్ లేవని చాలామంది అంటూ వుంటారు. మా ఫాదర్ తో నేను చేసింది 9 సినిమాలే .. వాటిలో 7 హిట్. 40కి పైగా సినిమాలు వేరే దర్శకులతో చేసినవి వున్నాయి"

"కథల ఎంపికను మా ఫాదర్ ఎప్పుడూ నాకే వదిలేసేవారు. నువ్ ఫ్రెండ్స్ తో కలిసి సినిమాలకి వెళుతున్నావ్ ... సినిమా ఎలా ఉండాలనేది నీకు తెలుసు. అందువలన నీ కెరియర్ .. నీ ఇష్టం .. నీ నిర్ణయాలు నువ్వే తీసుకో' అని ఆయన చెప్పేవారు. 'గమ్యం' చూసి వచ్చిన తరువాత ఆయన నాతో ఒక మాట అన్నారు. 'కథగా నాకు చెప్పి వుంటే ఈ సినిమా చేయవద్దని చెప్పేవాడిని. సినిమా అలా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు .. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావ్ .. నటన పరంగా అదరగొట్టేశావ్' అన్నారు" అంటూ నరేశ్ చెప్పుకొచ్చాడు.         
allari naresh

More Telugu News