కేరళ మేగజైన్ పై 'ఓపెన్ బ్రెస్ట్ ఫీడింగ్' ప్రచారం... పెనుదుమారం సృష్టించిన నటి గిలు జోసెఫ్ ఫోటో, కేసు నమోదు!

  • కేరళ మేగజైన్ 'గృహలక్ష్మి' ప్రత్యేక సంచిక
  • పెళ్లికాని గిలు జోసెఫ్ తో ఫొటో షూట్
  • బిడ్డకు పాలిస్తున్నట్టు కనిపించిన గిలు
  • విమర్శల వెల్లువతో కేసు నమోదు
కన్నబిడ్డ ఆకలి తీర్చడం తప్పా? నలుగురి ముందూ బిడ్డకు స్తన్యమివ్వాల్సి వస్తే సిగ్గుపడాలా? బిడ్డ కడుపు నింపే పనిని లైంగిక కోణం నుంచే చూడాలా? మారుతున్న కాలంలో మారుతున్న ప్రజలు ఈ ప్రశ్నలకు 'కాదు' అనే సమాధానం ఇస్తారు. అయితే, ఇదే భావాన్ని బహిరంగంగా వ్యక్తపరిస్తే భారత సమాజం హర్షించదు. కేరళ నటి గిలు జోసఫ్ ఇప్పుడు అదే తరహా విమర్శలు చవిచూస్తోంది.

 ప్రముఖ మలయాళ మేగజైన్ 'గృహలక్ష్మి' తన ప్రత్యేక సంచికలో 'బహిరంగంగా స్తన్యమివ్వడం'పై ప్రచారం తెస్తున్నామంటూ గిలు జోసఫ్ చిత్రాన్ని ప్రచురించింది. బిడ్డకు స్తన్యమిస్తూ, కెమెరావైపు గర్వంగా చూస్తున్నట్టు ఈ కవర్ పేజీపై గిలు కనిపిస్తుండగా, అసలు పెళ్లికూడా కాని గిలుతో ఈ ఫొటో షూట్ లు, అసభ్యకర చిత్రాలు ఏంటని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మేగజైన్ ప్రచురణకర్తలతో పాటు గిలు జోసెఫ్ పైనా పోలీసు కేసు నమోదైంది. ఇండియా సహా చాలా దేశాల్లో బహిరంగంగా బిడ్డకు పాలివ్వడాన్ని వివాదాస్పద అంశంగానే చూస్తున్నారన్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Kerala
gilu joseph
Gruhalakshmi
Magazine

More Telugu News