టీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదు: టీటీడీపీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి
Add ap7am to your home Screen

టీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదు: టీటీడీపీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి

  • అవినీతి ప్రభుత్వానికి టీడీపీ అండగా ఉండబోదు
  • టీఆర్ఎస్ తో కలిసి పని చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా లేరు
  • మీడియాతో టీటీడీపీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి
టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని టీటీడీపీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, అవినీతి ప్రభుత్వానికి టీడీపీ అండగా ఉండబోదని, టీడీపీలో ప్రస్తుతం ఉన్న నేతలు టీఆర్ఎస్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేరని అన్నారు. కాగా, టీటీడీపీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో హైదరాబాద్ లోని తన నివాసంలో సీఎం చంద్రబాబు ఈరోజు కూడా సమావేశమయ్యారు.

ఒంటేరు ప్రతాప్ రెడ్డికి పార్టీ అండగా ఉంటుందని, పార్టీని నమ్ముకున్న ఏ నాయకుడిని వదులుకోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పొత్తుల అంశంపై కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే మాట్లాడుకుందామని చంద్రబాబు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
 
Telangana
onteu pratapreddy

More Telugu News