రిలయన్స్ బిగ్ టీవీ ఆఫర్: ఏడాది పాటు అన్ని పెయిడ్, హెచ్ డీ చానల్స్ ఉచితం... షరతులు వర్తిస్తాయి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రిలయన్స్ బిగ్ టీవీ ఆఫర్: ఏడాది పాటు అన్ని పెయిడ్, హెచ్ డీ చానల్స్ ఉచితం... షరతులు వర్తిస్తాయి!

  • రూ.2,000 చెల్లించి కనెక్షన్ తీసుకోవాలి
  • ఏడాది వరకూ అన్నీ ఉచితం
  • ఆ తర్వాత ప్రతీ నెలా రూ.300 రీచార్జ్
  • రెండేళ్ల రీచార్జ్ తర్వాత రూ.2,000 వెనక్కి
  • ఐదేళ్ల పాటు ఉచిత చానల్స్ వీక్షణ అవకాశం
డీటీహెచ్ సేవల్లోని రిలయన్స్ బిగ్ టీవీ ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించే లక్ష్యంతో సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. రిలయన్స్ బిగ్ టీవీ కనెక్షన్ కోసం సంస్థకు చెందిన వెబ్ సైట్ ద్వారా రూ.499 చెల్లించి బుక్ చేసుకుంటే ఏడాది పాటు హెచ్ డీ చానల్స్, పెయిడ్ చానల్స్ అన్నీ ఉచితం. అలాగే ఐదేళ్ల పాటు ఎయిర్ టు ఫ్రీ చానల్స్ కూడా ఉచితంగా వీక్షించవచ్చు. ఇందుకోసం ఈ నెల 1న ఉదయం 10 గంటల నుంచి సంస్థ వెబ్ సైట్ లో బుకింగ్ లు మొదలయ్యాయి.

కంపెనీ కొన్ని షరతులు కూడా పెట్టింది. తొలుత రూ.499 చెల్లించి బుక్ చేసుకోవాలి. ఇంటికి టెక్నీషియన్ వచ్చి డిష్, సెట్ టాప్ బాక్స్ సెట్ చేసినప్పుడు మరో రూ.1,500తోపాటు రూ.250 ఇన్ స్టలేషన్ చార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. మొదటి ఏడాది ఇక రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రెండో ఏడాది నుంచి ప్రతీ నెలా రూ.300 రీచార్జ్ చేసుకోవడం ద్వారా అన్ని సేవల్ని యథావిధిగా పొందొచ్చు. అలా రెండేళ్ల పాటు ప్రతీ నెలా రూ.300 చొప్పున రీచార్జ్ చేసుకుంటే ఆ తర్వాత అంటే కనెక్షన్ తీసుకుని ముచ్చటగా మూడేళ్లు పూర్తయిన తర్వాత సెట్ టాప్ బాక్స్, కనెక్షన్ కోసం మొదట చెల్లించిన రూ.2,000 వెనక్కి వచ్చేస్తాయి. ఆ విలువను యూజర్ బిగ్ టీవీ అకౌంట్ లో జమ చేస్తారు. తిరిగి చానల్స్ రీచార్జ్ కోసం వినియోగించుకోవచ్చు.
reliance big tv
offer

More Telugu News