'రంగస్థలం' నుంచి సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రంగస్థలం' నుంచి సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది

  • సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' 
  • రేపు సెకండ్ సాంగ్ రిలీజ్ 
  • త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్
గతంలో గ్రామీణ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో చాలావరకూ భారీ విజయాలను అందుకున్నాయి. చాలాకాలం తరువాత మళ్లీ గ్రామీణ నేపథ్యంలో కథను ఇతివృత్తంగా తీసుకుని సుకుమార్ 'రంగస్థలం' సినిమా చేస్తున్నాడు. చరణ్ .. సమంత నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే వదిలిన మొదటి పాటకు అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక 'రంగా .. రంగా .. రంగస్థలాన ..' అనే రెండవ సాంగ్ ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా తాజాగా వదిలారు. లవ్ .. మర్డర్ మిస్టరీ .. రాజకీయాల నేపథ్యంలో ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా కొనసాగుతుందని అంటున్నారు. త్వరలో వైజాగ్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా .. ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.   
charan
samanta

More Telugu News